ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటన చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు ఇంటింటికి పంపిణీకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ….ప్రతీ ఇంట్లో ఒకరి ఫోన్‌లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీఎం జగన్.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదని అడుగులు వేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు.. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరం.. 4 కోట్ల 25 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేశామన్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్సల సంఖ్యను పెంచామని వివరించారు సీఎం జగన్. 1059 ప్రొసీజర్ల నుంచి 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని..వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని ప్రకటన చేశారు సీఎం జగన్.