ఒకరిని పెళ్లి చేసుకుని..మరోకరితో పవన్‌ కళ్యాణ్‌ అక్రమ సంబంధం – సీఎం జగన్‌

-

ఒకరిని పెళ్లి చేసుకుని..మరోకరితో పవన్‌ కళ్యాణ్‌ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటించి… వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం నిధుల విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఉదయాన్నే చిరునవ్వుతో మీ తలుపుతట్టి మీ మంచి చెడులు అడుగుతారని నిప్పులు చెరిగారు. అవినీతి, వివక్ష తెలియని మంచివాళ్లు వాలంటీర్లు అంటూ తెలిపారు.

తప్పుడు మాటలకు నిర్మాత చంద్రబాబు.. నటన, డైలాగులు దత్తపుత్రుడివి. మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిస్సిగ్గుగా ఒకరంటున్నారని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌. మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులను ఎవరూ అవమానించరని తెలిపారు. వాలంటీర్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా..? అని ప్రశ్నించారు. మంచి చేస్తున్న వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నారన్నారు. ఎండ, వాన, వరదలను లెక్క చేయకుండా వాలంటీర్లు పని చేస్తున్నారని కొనియాడారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version