ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ లపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన మీడియా సమావేశాలకు ప్రతినిధులు ఎవరూ వెళ్ళకుండానే ముగుస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆయన ప్రెస్ మీట్ ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. తాజాగా జగన్ ఒక మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా జగన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసారు. రోజు రోజుకి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపధ్యంలో ఆయనలో సీరియస్ నెస్ లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కరోనా తో జీవించాలి అని చెప్పడం, అదే విధంగా కరోనా సాధారణ జ్వరం అని మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ముందు నుంచి జగన్ ఇలాగే మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడారు.
ఇక ఆయన ప్రెస్ మీట్ రికార్డ్ చేసింది అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆయన వాచ్ లో సమయం 1 అని ఉంది. ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది సాయంత్రం 5 గంటలకు. అంటే ఇది రికార్డ్ చేసి విడుదల చేసారా అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత సీరియస్ గా ఉన్న సమయంలో జగన్ మీడియా ప్రతినిధులకు ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. వారితో అసలు మాట్లాడటం లేదు. ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.