ఇవాళ జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

-

BREAKING : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇవాళ విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లా నగరిలో సిఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసిక లబ్ధి ని ప్రారంభించే కార్యక్రమాన్ని కంప్యూటరు లో బటన్ నొక్కి ప్రారంభించనున్నారు సిఎం జగన్‌. చిత్తూరు జిల్లాలో 31,180 మంది తల్లుల ఖాతాలకు జమ కానున్నాయి.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి కి చేరుకుంటారు సీఎం జగన్. విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థుల ఫీజుల మొత్తాన్ని విడదల వారీగా తల్లుల ఖాతాలలో జమ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version