శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండింది -కారుమూరి నాగేశ్వరరావు

-

శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండిందని నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి వర్యులు కారుమూరి నాగేశ్వరరావు. ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తుందని ఫైర్‌ అయ్యారు. ప్రజలు చంద్రబాబు గురించి ఆలోచించడం లేదన్నారు కారుమూరి నాగేశ్వరరావు.

చంద్రబాబు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే.. జగన్ డాక్టర్లను పంపిస్తున్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదు. చంద్రబాబు ఇన్నేళ్ళు స్టేల మీదే బతికాడని ఆగ్రహించారు. శిశుపాలుడిలా చంద్రబాబు పాపం పండిందని విమర్శలు చేశారు.

చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి జగన్ పై తప్పుడు కేసులు పెట్టారన్నారు కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. గతంలో చంద్రబాబు మనకు ఏం ప్రయోజనం చేశాడు అని చర్చించుకున్నారని వివరించారు కారుమూరి నాగేశ్వరరావు. ఎవరెన్ని కుట్రలు చేసినా… వైసీపీ విజయం ఖాయమని.. మరోసారి జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం అవుతారని స్పష్టం చేశారు కారుమూరి నాగేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version