చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు – కేశినేని నాని

-

చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ ఫైర్‌ అయ్యారు కేశినేని నాని. గతంలో కేశినేని చిన్ని కారు నంబర్లు 5555 నావి 7777 అని… నేను ఎంపీ అయ్యాక తాను కూడా కారు నంబర్లు 7777 వాడాడని మండిపడ్డారు. కానీ రియల్ ఎస్టేట్ దందాల కోసం వందల స్టిక్కర్లు కారులకు వేసి వాడాడు… నేను నా స్టిక్కర్ ఫేక్ వి తయారు చేసి వాడుతుంటే నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

అపర కుబేరుడు అంటాడు ఇలా మోసాలు చేయటం ఏంటి అని నిలదీశారు. కేశినేని చిన్ని లాంటి వ్యక్తులు ఎంపీ లేదా ఎంఎల్ఏ లు అయితే సమాజం పరిస్థితి ఏంటి అంటూ ఫైర్ అయ్యారు. నేను ఎంపీగా ఏ తప్పు చేయలేదు….ఇలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి ఎంపీగా టీడీపీ టికెట్ ఇచ్చిందని ఆగ్రహించారు. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారని విమర్శలు చేశారు. బెజవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మాత్రమే ఈ విషయాలను చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version