ఉచిత రేషన్ పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

-

కేంద్రం పంపిణీ చేసే ఉచితరేషన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో 4 కోట్ల 23 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నామని,రూపాయికే కిలో బియ్యం అందిస్తున్నామన్నారు.కరోన వైపరీత్యం వచ్చినప్పుడు కేంద్రం పీఎంజీకేవై పథకం పెట్టి,ఆ కేంద్రం పథకానికి 2 కోట్ల 68 లక్షల మందికి మాత్రమే ఆ పథకం అమలు చేసిందని అన్నారు.
మేము కోటి 50 లక్షల మందికి అదనంగా అందించామన్నారు.ప్రస్తుతం కరోన తగ్గింది కాబట్టి 3 నెలల నుండి పునరాలోచన చేశామన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 86 శాతం మందికి లబ్ది చేస్తున్నది మన రాష్ట్రమేనని అన్నారు మంత్రి బొత్స. దీనిపై మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించామన్నారు.కేంద్రం ఇచ్చే కార్డులకు అదనపు బియ్యాన్ని ప్రత్యేకంగా పంపిణీ చేస్తామన్నారు.అందుకే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లో వారికి అందిస్తామని..విశాఖపట్నం, తిరుపతి నగరాలకు మినహాయించి, ప్రకాశం జిల్లాకు అందిస్తున్నామన్నారు.కోటి 67 లక్షల మందికి కేంద్రం ఇచ్చిన బియ్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు మంత్రి.మిగిలిన జిల్లాల్లోని ఎస్సి, ఎస్టీ వర్గాలకు కూడా 89 లక్షల 20 వేల మందికి ఇస్తామన్నారు.

ఏఏవై కార్డులున్న వారికి కూడా ఇస్తామని తెలియజేశారు.వచ్చే నెల ఒకటో తేదీ నుండి ఈ బియ్యం అందిస్తామన్నారు.ప్రతి నెలా ఇచ్చే రేషన్ కి అదనంగా కేంద్రం ఇచ్చే రేషన్ ఇస్తామని అలాగేడోర్ డెలివరీ విధానం లో రెగులర్ గా ఇచ్చే బియ్యం కూడా ఇస్తామన్నారు.కేంద్రం ఇచ్చేది రేషన్ షాప్ లకు వెళ్లి తీసుకోవాలని అన్నారు.మేము ఇంటింటికి ఇచ్చే బియ్యం సోర్టెక్స్ బియ్యమని..కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం నాన్ సోర్టెక్స్ బియ్యమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version