చంద్రబాబు నిష్ఠ దరిద్రుడు – కొడాలి నాని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడని మడిపడ్డారు. చంద్రబాబు నిష్ఠ దరిద్రుడు అని.. ఏ రకంగా దిగజారిపోయాడో అందరూ చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు పుట్టడంతోనే రాజకీయ వ్యభిచారంతో పుట్టాడని మండిపడ్డారు. టిడిపికి చెందిన దళిత మహిళతో పనికిమాలిన వ్యాఖ్యలు చేయిస్తున్నారని.. పదవులు ఇవ్వాలంటే మాత్రం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఇస్తారని అన్నారు కొడాలి నాని.

చంద్రబాబు వస్తే మోడీ లేచి నిలబడ్డాడని టిడిపి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని.. నన్ను క్షమించండి అని చంద్రబాబు మోడీని వేడుకున్నట్లు మాకు తెలిసిందని అన్నారు. చంద్రబాబు పట్ల రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు కొడాలి నాని. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలుస్తాడని దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబుకు భజన చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version