మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు..తెరపైకి ఏపీకి చెందిన ఎంపీ ?

-

హైదరాబాద్ మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టైన వెంకట్‌ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు చేశారని అధికారులు గుర్తించారు. నిర్మాతలు సి. కల్యాణ్‌, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ వసూలు చేశాడట వెంకట్‌.

నిర్మాతల నుంచి రూ.30 లక్షలకుపైగా కొట్టేసిన వెంకటరత్నారెడ్డి…ఒక ఐఆర్‌ఎస్‌ అధికారినిసైతం పెళ్లి పేరుతో మోసం చేశాడట. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేశాడట. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం కూడా చేయించేవాడట. పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్…ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్న వెంకట్…. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టిస్తున్నాడు. వెంకట్‌ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version