ఫ్రీ వెడ్డింగ్ షూట్.. అంటూ చెత్త వార్తలు రాశారు – మాధురి ఫైర్

-

మీడియా పై దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి సీరియస్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ప్రీ వెడ్డింగ్ చేసారని వార్తలు రావడం పై దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి స్పందించారు. మీకు దమ్ముంటే దువ్వాడ శ్రీనివాస్ ని ధైర్యంగా ఎదుర్కోండి అని మాధురి ఫైర్ అయ్యారు.

Duvvada Srinivas, Divvala Madhuri Spotted in Tirumala

తిరుమల మాడ వీధుల్లో దువ్వాడ, మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెత్త వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. న్యూస్ ఛానెల్స్ అనేవి నిజాలు చూపించాలి కానీ మీకు నచ్చినట్టు ఏది పడితే అది ఎలా రాస్తారు ? అని నిలదీశారు. నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తే ఆధారాలు చూపించండి అని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటానని వెల్లడించారు మాధురి.

ఏటా నేను బ్ర‌హ్మోత్సవాల‌కు తిరుమ‌ల‌ వ‌స్తాను అన్నారు. గ‌తంలో నా డ్యాన్స్ టీమ్‌తో మాడ‌వీధుల్లో ప్రోగ్రామ్స్ చేయించానని చెప్పారు. ఇక‌పై దువ్వాడ శ్రీ‌నివాస్‌తోనే క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను.. అందుకే ఇద్ద‌రం క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకున్నామన్నారు మాధురి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version