ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అమిత్ అరోరా అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరుతూ… రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఏడు రోజులు రిమాండ్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ఈడీ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఉందని ఈడీ వెల్లడించింది.
అయితే లిక్కర్ స్కాం లో తన పేరును చేర్చడంపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఉత్తర భారత లిక్కర్ వ్యాపారులు సౌత్ ఇండియా పై పుట్రలు చేస్తున్నారని ఎంపీ మాగుంట ఫైర్ అయ్యారు. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరు ఎందుకు వచ్చిందో తెలియదని పేర్కొన్నారు. అసలు అమిత అరోరా ను తాను ఎప్పుడు కలవలేదని చెప్పారు. కనీస అతని ముఖ పరిచయం కూడా లేదని వివరించారు మాగుంట. ఢిల్లీ లిక్కర్ స్కాం కు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాగుంట క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇస్తానని కూడా మాగుంట వివరించారు.