వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు – మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు

-

మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానో? లేదో? తెలియదని.. దానికి ఇంకో సంవత్సరం సమయం ఉందని అన్నారు. నేడు శ్రీకాకుళం పీఎస్ఎన్ఎమ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ధర్మాన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే కొందరు జగన్ సర్కారుపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అందుకే వచ్చే ఎన్నికలలో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగిపోయాయని ప్రచారం చేస్తున్నారని.. ధరలు పెరగడానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ధరలు దేశంలో అన్ని ప్రాంతాలలో పెరుగుతున్నాయన్నారు. జగన్ కి ప్రజల్లో ఉన్న ఆదరణను తగ్గించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version