మంచి ఆలోచనే: చినబాబు సంచలన నిర్ణయం… సంక్రాంతి తర్వాత అమలు!

-

టీడీపీ భవిష్యత్ ఆశాకిరణం.. తురుపుముక్క.. భవిష్యత్ ఏపీ ముఖ్యమంత్రి అని టీడీపీ నేతలు, చంద్రబాబు భావిసోన్నా నారాలోకేష్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు అని కథనాలు వెలువడుతున్నాయి. ఈ సంచలన నిర్ణయానికి సంబందించి గతంలోనే కథనాలు వచ్చినప్పటికీ.. అవన్నీ కరోనాపాలయిపోయాయి. ఫలితంగా చినబాబు ట్విట్టర్ కి పెదబాబు జూం కి పరిమితమైపోయారు. ఈ క్రమంలో… కరోనా డిశెంబర్ లో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్న క్రమంలో… సైకిల్ వేసుకుని జనాల దగ్గరకు వెళ్లాలని చినబాబు భావిస్తున్నారంట.

గతంలో వైఎస్సార్, చంద్రబాబు.. తాజాగా యువ సీఎం జగన్ లు పాదయాత్రలు చేసి.. సీఎం పీఠాన్ని అధిష్టించిన సంగతి తెలిసిందే. అలా అని పాదయాత్ర చేయబట్టి మాత్రమే వారు సీఎంలు అయ్యారంటే అది పొరపాటే. వారిపై ప్రజలకున్న నమ్మకానికి పాదయాత్ర కూడా తోడయ్యింది!! ఈ క్రమంలో వారంతా పాదయాత్రలు చేసి సీఎం చైర్ ఎక్కారు కాబట్టి… తాను కూడా జనాల కష్ట సుఖాలు తెలుగుకోవడానికి జనాల్లోకి వెళ్లలని నిర్ణయించుకున్నారంట.

అయితే పాదయాత్రకు తన శరీరం సహకరించదని భావించారో లేక పార్టీ గుర్తుని జనాల్లోకి మరోసారి బలంగా తీసుకెళ్లాలని ఆలోచించారో తెలియదు కానీ… పాదయాత్ర వద్దు – సైకిల్ యాత్ర ముద్దు అంటున్నారట లోకేష్! అన్నీ అనుకూలంగా జరిగితే… సంక్రాంతి అనంతరం చినబాబు సైకిల్ ఎక్కి ఏపీ మొత్తం ఒక రౌడ్ వేసేస్తారని అంటున్నారు. సీఎం కొడుకుగా, మంత్రిగా, చినబాబు తనను తాను నిరూపించుకున్నది ఇప్పటివరకూ శూన్యం అనే చెప్పాలి. ఈ క్రమంలో ఇలాంటి యాత్ర చేయడంవల్ల… తనకు తాను కాస్త మార్కులు తెచ్చుకోవడంతోపాటు.. క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటు.. యువరక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించినట్లు అవుతుందని భావిస్తున్నారంట! మంచి ఆలోచనే.. కార్యరూపం దాల్చితే!

Read more RELATED
Recommended to you

Latest news