తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ఠ్. గరుడ సేవ సంధర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు అధికారులు. గ్యాలరిలో వేచివున్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం అందించనున్నారు. అన్నప్రసాద సముదాయంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు భక్తులుకు అన్నప్రసాద వితరణ ఉండనుంది. 5 వేల మంది సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశారు. 2700 సిసి కెమరాలతో కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు.
ఇద్దరు డిఐజిలు, ఐదు మంది ఎస్పిలు భధ్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూన్నారు. ఇక రేపు ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇవ్వడంలేదని పేర్కొన్నారు. అటు నడకదారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. తిరుమలకు విచ్చేసే మార్గాలలో వాహనాలకు టోకేన్లు అందిస్తామంటున్నారు పోలీసులు. అటు తిరుపతిలో మూడు ప్రాంతాలలో వాహనాల పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలిపిరి వద్దే వాహనాల నియంత్రణ చేస్తూన్నారు పోలీసులు.