నా అరెస్ట్ పై 60 దేశాల్లో ఆందోళనలు : సీఎం చంద్రబాబు

-

తనను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాలలో ఆందోళనలు చేశారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో తన అరెస్ట్ పై ఆందోళనలను అణచివేయాలని చూసినవారు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారని ఎద్దేవా చేసారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు సీఎం చంద్రబాబు.  ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో లిక్కర్ పాలసీలను సర్వనాశనం చేశారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదు. ఫలితంగా ప్రజలు వారిని ఇంటికి సాగనంపారు. ఏపీ, ఢిల్లీ ప్రజలు వారి తప్పు తెలుసుకొని కష్టాల నుంచి బయటపడ్డారని సీఎం చంద్రబాబు తెలిపారు.

CM Chandrababu

1991 తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. తెలుగు బిడ్డ పీ.వీ.నరసింహరావు తీసుకొచ్చారు. 1995-2024 మధ్య మన తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగింది. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతోంది. మౌళిక వసతులు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల డాలర్ల తలసరి ఆదాయం ఉంది. బీహార్ లో తలసరి ఆదాయం 750 మాత్రమే ఉందని తెలిపారు. టెక్నాలజీ సాయంతో మనం ముందుకు వెళ్తున్నాం. 

Read more RELATED
Recommended to you

Exit mobile version