జగన్ ను అసలు హిందువేనా ? – ఆర్‌ఆర్‌ఆర్‌

-

 

జగన్ మోహన్ రెడ్డి గారిని మహావిష్ణువుతో పోలుస్తూ, ఆయన్ని విమర్శించడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని రాజమండ్రి ఎంపీ భరత్ గారు చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు రఘురామకృష్ణ రాజు గారు దృష్టికి తీసుకురాగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏమైనా హిందువా? అని, శ్రీ మహావిష్ణువు ఎక్కడైనా ఈస్టర్ పండుగలో పాల్గొంటారా?? అని ప్రశ్నించారు. తన పేరు రఘురామకృష్ణ రాజు అని మరి తన గురించి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే హిందువులను అవమానించినట్లు కాదా? అని అన్నారు. తన పేరులోనూ రాముడు, కృష్ణుడు ఉన్నారని గుర్తు చేశారు.

ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని పప్పు అని విమర్శిస్తున్న వారు, ఈశ్వరుడిని నిందించినట్లు కాదా? అని నిలదీశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మతాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. తనలాంటి వారు ఇలా మాట్లాడి ఉంటే మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నామనిని సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి ఉండేవారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కోడి కత్తి విచారణకు ఎన్ఐఏ కోర్టుకు కూడా హాజరుకానని పేర్కొనడం సరికాదని, తనపై కోడి కత్తి దాడి ఎలా జరిగిందో చెబితే బాగుండేదని, కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇకనైనా విడుదల చేయాలని అన్నారు. మాజీమంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో రానున్న 72 గంటల వ్యవధిలో అరెస్టులు జరిగే అవకాశం లేకపోలేదని, ఏప్రిల్ నెల అఖరు నాటికి కేసు విచారణను పూర్తి చేస్తామని ఇప్పటికే సుప్రీంకోర్టుకు సీబీఐ విన్నవించిందని, ఈ హత్య సూత్రధారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు అని హైకోర్టుకు సీబీఐ ఇప్పటికే స్పష్టంగా చెప్పడమే కాకుండా వారిని అరెస్టు చేస్తామని కూడా పేర్కొనడం జరిగిందని, ఈ కేసు విచారణ ఒక స్థాయి వరకు కచ్చితంగా జరగవచ్చునని తెలిపారు.

ఆ పై స్థాయి వ్యక్తుల ప్రమేయం గురించి విచారణ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలని రఘురామకృష్ణ రాజు వారు తెలిపారు. గన్నవరంలో కళ్యాణి గారిని ఆడ పోలీసుల సహకారంతో మగ పోలీసులు అరెస్టు చేసిన తీరు దారుణమని, అర్ధరాత్రి పూట నిద్రిస్తున్న కళ్యాణి గారు తాను నైట్ డ్రెస్ లో ఉన్నాను, డ్రెస్ మార్చుకుని చీర కట్టుకుని వస్తానని చెప్పినప్పటికీ, సమయం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం అత్యంత హేయమాని అన్నారు. ఈ సంఘటనను తమ పార్టీలోని మహిళలు కూడా ఛీ… కొడుతున్నారని, ఈ సంఘటనతో మహిళా ఓట్లన్నీ తమ పార్టీకి దూరమైనట్లేనని అన్నారు. ప్రతి ఏటా జాబు క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సాక్షి దినపత్రిక అడ్వర్టైజ్మెంట్ క్యాలెండర్ ను విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version