పవన్ కళ్యాణ్ వెంట్రుక కూడా పీకలేరని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత వివరాలను సేకరించి వాలంటీర్లు జగన్ మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు నిర్వహిస్తున్న యూనికాన్ సంస్థకు అందజేయడం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులలో భాగంగా వ్యక్తిగత గోప్యానికి భంగం కలిగించడమేనని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు.
ఒంటరి మహిళల అదృశ్యానికి ఇది ఒక కారణమై ఉండవచ్చని మాత్రమే ఆయన అన్నారని, రాష్ట్రంలో 29 వేల మంది మహిళలు అదృశ్యమైతే, వారిలో 18 వేల మంది మహిళలు తిరిగి ఇంటికి చేరగా, మిగిలిన వారి వివరాలు తెలియడం లేదని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారని, ఒక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిపై పత్రికల్లో వచ్చిన వార్త కథనాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే పరువు నష్టం దావా వేయడం అన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఎవరినైనా వ్యక్తిగతంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే వారు పరువు నష్టం దావా వేయడం అన్నది పరిపాటి అని, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వమే ఉలికిపాటు పడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలి అంటే కొన్ని నియమ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుందని, ఢిల్లీ నుంచి మంగళగిరికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం ఈ మేరకు నోటీసులు జారీ చేసిందని అన్నారు.