అవినాష్ రెడ్డి గారి తల్లికి నిజంగానే ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాద్ కు తరలించేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు.కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి తల్లికి ఆయన చెబుతున్నట్లుగా ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాదుకు తరలించి చికిత్స అందించి ఉండేవారని, సుప్రీం కోర్టులో అప్పియరెన్స్ కోసం 15 లక్షల రూపాయల ఖర్చు చేయగలిగిన అవినాష్ రెడ్డి గారు తన తల్లిని హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రులకు ప్రత్యేక విమానంలో తరలించడానికి ఐదు లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు మరో పది లక్షల రూపాయలు వెచ్చించలేరా? అని నిలదీశారు.
ఒకవైపు కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రి ఆవరణలో ఆకు రౌడీలను పెట్టుకుని సీబీఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న అవినాష్ రెడ్డి గారు, సుప్రీం కోర్టులోను పిటిషన్ మెన్షన్ చేయగా చుక్కెదురయ్యిందని, జస్టిస్ సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ బెంచ్ ముందు మెన్షన్ చేసే ప్రయత్నం చేయగా, నాట్ బిఫోర్ అన్నారని, జస్టిస్ సంజయ్ కరోల్ తనయుడు, డాక్టర్ సునీత గారి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ లూత్రా వద్ద అప్రెంటీస్ గా పనిచేస్తుండడం వల్ల నాట్ బిఫోర్ అని పేర్కొన్నారని అన్నారు. జస్టిస్ నరసింహ, జెకె మహేశ్వరి బెంచ్ ముందు మెన్షన్ చేయడానికి లేదని, అయినా మెన్షనింగ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి మెన్షన్ చేయించాలని ధర్మాసనం సూచించిందని పేర్కొన్నారు.