బ్రదర్ అనిల్ వల్ల వైసీపీకి 17% ఓట్లు పడ్డాయి – రఘురామ

-

కేఏ పాల్ గారి ఆశీస్సుల వల్లే తాను ఎన్నికల్లో నెగ్గానని, కానీ తాను వందల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి గెలిచానని కె ఏ పాల్ గారు అంటున్నారని, తాను కేఏ పాల్ గారి ఆశీస్సుల వల్లే గెలిచానని చెప్తుంటే ఆయన తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా, అగౌరవ పరచుకునే విధంగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఎంపీ రఘురామ.

తనకు కేఏ పాల్ గారు రాడ్డు దింపారని సాక్షి మీడియా ప్రచారం చేస్తూ, ఆయన్ని ఆకాశానికి ఎత్తుతోందని, ఇందులో తనకు రాడ్ దింపిన అంశం ఏమిటో అర్థం కాలేదని అన్నారు. బ్రదర్ అనిల్ గారి ప్రచారం వల్ల గత ఎన్నికల్లో తమ పార్టీకి 17% ఓట్లు పడ్డాయని, ఈసారి బ్రదర్ అనిల్ గారు తమ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశాలు లేవని, ఆ 17% ఓట్లు సంకనాకి పోయే ప్రమాదం ఉందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి రావణ పాలన మళ్లీ రాష్ట్రంలో రావాలంటే కె ఏ పాల్ గారి సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా ప్రజా శాంతి పార్టీని తమ పార్టీలో విలీనం చేసి, తమ పార్టీని అంతర్జాతీయ పార్టీగా రూపొందించండని అన్నారు.

ప్రస్తుతం తమ పార్టీని జాతీయ పార్టీగా పేర్కొంటున్నామని, ప్రజాశాంతి పార్టీ విలీనంతో అంతర్జాతీయ పార్టీ అవుతుందని అన్నారు. బ్రదర్ అనిల్ గారు లేని లోటును కేఏ పాల్ గారు పూడ్చాలని, సింహం సింగల్ గా వస్తుందని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి గారికి, అంతర్జాతీయ సింహమైన కె ఏ పాల్ గారు తోడు కావాలని అన్నారు. ఈ ఇద్దరు సింహాలను ఎదుర్కొనేందుకు ప్రజలు సన్నద్ధమవుతారని, కేఏ పాల్ గారి తిట్లను కూడా తాను ఆశీస్సులు గానే భావిస్తున్నానని, రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ప్రజలు వలస వెళ్తున్నారని, ఆ వలసలు నిలిచిపోవాలంటే శ్రీమంతుడు సినిమాలో సైకిల్ వేసుకొని మహేష్ బాబు వచ్చినట్టుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఎవరైనా సైకిల్ వేసుకొని వస్తారా? అనేది చూడాలని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version