ఏపీలో త్వరలోనే జైలర్ సినిమా సీన్ రిపీట్ అవుతుంది – వైసిపి ఎంపీ

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రి కానీ తండ్రి లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన నిజ స్వరూపం తెలిసిపోయి ఉంటుందని, రాష్ట్రంలో త్వరలోనే రజినీకాంత్ గారు హీరోగా నటించిన జైలర్ సినిమా సీన్ రిపీట్ అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. జైలర్ చిత్రంలో కథానాయకుడైన రజినీకాంత్ గారి కుమారుడు పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్నతమైన స్థానంలో ఉండి దొంగతనాలను చేస్తుంటాడని, ఆ విషయాన్ని తెలుసుకున్న రజినీకాంత్ గారు అతన్ని చంపాలని ఆదేశిస్తారని పేర్కొన్నారు.

rrr comments on jailer

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేపో మాపో అటువంటి సీన్ రిపీట్ అవుతుందని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు.బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గారి గురించి తమ పార్టీ నాయకులు కూస్తున్న కారు కూతలు వింటే బాధనిపిస్తోందని, విదేశాల్లో తమ పార్టీకి ఓ ప్రతినిధి ఉన్నాడని, వాడు మరింత వరస్ట్ గా మాట్లాడుతున్నాడని, అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, సీఐడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కూడా చేతులెత్తేశాయని, తనను గతంలో దూషించి తప్పించుకున్నాడని, కానీ మహిళల గురించి అనుచితంగా మాట్లాడినందుకు టైగర్ కా హుకుం వస్తుందని అనిపిస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version