ఆ 16 మంది వైసీపీ నేతలు ఎక్కడా?.. గన్నవరం ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌

-

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రైసిస్ మెనేజ్మెంట్ లో చంద్రబాబుపై వైసిపి చేస్తున్న ఆరోపణలు దారుణమన్నారు. జగన్ తనకు ప్రతిపక్ష హెూదా ప్రజలు ఇవ్వలేదని వారిపై కక్షకట్టారని ఆగ్రహించారు. సింగ్ నగర్ ప్రాంతం వైసిపికి అనుకూలంగా ఉన్న ప్రాంతమన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది పోటీ చేస్తే వారంతా కనపడడం లేదని ఆగ్రహించారు. రాజశేఖర్ రెడ్డి ఇంటిపేరు శ్రీబాగ్ ఓడంబిడకు ఉద్దేశించి పెట్టారు జలాశయాల విషయంలో తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని జగన్ పై ఫైర్ అయ్యారు.

Sensational comments of Gannavaram MLA Yarlagadda Venkatarao

జగన్… బుడమేరు పనులు ఆపేయడం వల్లే విజయవాడకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. 16 మంది వైసిపి వారు ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో వరద వస్తే ఎవ్వరూ రాలేదని తెలిపారు. అలాంటి వారు చంద్రబాబు ఇక్కడే ఉండి సహయక చర్యలు చేస్తుంటే ఆయన్ను విమర్శలు చేస్తారా అని నిలదీశారు. విదేశాలకు వెళదామనుకున్ జగన్ ఇక్కడ ఉండి ప్రజల సేవ చేయాలని సూచనలు చేశారు. అయితే ఆయన రాజకీయ విమర్శలు చేస్తున్నారని… భూతులు తిట్టిన వారు అందరూ ఓడిపోయారని సెటైర్లు పేల్చారు. గత ప్రభుత్వం తెలుగు భాషపై దాడి చేసింది… వైనాట్ 175 అని తరువాత సిద్ధం అని మీద పడిపోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version