వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమల దర్శన టికెట్ల పెంపు

-

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ), రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.

వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్‌ సేవలకు కేటాయించే టికెట్లను తగ్గించి ఎస్‌ఎస్‌డీ, ఎస్‌ఈడీ టికెట్ల కోటా పెంచుతాం. ఎన్నికల కోడ్‌ రానున్న నేపథ్యంలో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోటా ఇవ్వబోం. ఈ నెల 8వ తేదీన గోగర్భతీర్థంలో క్షేత్ర పాలకుడికి మహా శివరాత్రి పర్వదినాన్ని, 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్ని, 25న తుంబుర తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నామం. ఫిబ్రవరిలో 19.06 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.111.71 కోట్ల హుండీ కానుకలు లభించాయి. అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version