BREAKING : అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

-

ఏపీ అసెంబ్లీలో గందర గోళం పరిస్థితి నెలకొంది. ఏపీ అసెంబ్లీ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. ప్ల కార్డులతో టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. అయితే.. టీడీపీ పార్టీ సభ్యుల.. ప్రవర్తన పై స్పీకర్‌ తమ్మినేని సీతారాం సీరియస్‌ అయ్యారు. దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ వేస్తూ..ఆదేశాలు జారీ చేశారు.

ఒక రోజు సస్పెండ్‌ చేసిన స్పీకర్.. వెంటనే అసెంబ్లీ నుంచి బయటకు పోవాలని ఆదేశించారు. దీంతో టీడీపీ పార్టీ సభ్యులు.. అసెంబ్లీ నుంచి వెళ్లి పోయారు.కాగా.. ఇవాళ సీఎంఆర్ఎఫ్, మత్స్యకారులకు ఆర్ధిక సాయం, వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్పుట్ సబ్సిడీ, ఎంపీఈఓలకు కనీస వేతనం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, ఆశా వర్కర్ల జీతాలు, ఎంఎస్ఎంఈ ప్రొత్సాహాకాలు, కోవిడ్ నష్ట పరిహరం, ఆర్టీసీ బలోపేతం, ప్రశ్నోత్తరాల అనంతరం అంతరాష్ట్ర జల వివాదాలపై కాలింగ్ అటెన్షన్ పై చర్చ జరుగనునంది. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news