దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం – సజ్జల

-

విజయవాడ బందర్ రోడ్డులో నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులను పరిశీలించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ముఖ్యమంత్రి జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తారని.. దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ విగ్రహం ఉంటుందన్నారు సజ్జల.

20 ఎకరాలలో స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎక్కడో ముళ్ళకంపల మధ్య పెడతామని ఐదేళ్లు కాలయాపన చేసిందని ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవానికి అంబేద్కర్ ఎంతో స్పూర్తిని ఇచ్చారని ప్రశంసించారు. ఈ స్మృతివనంలో అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలోని ఏ మూల నుండి చూసినా అంబేద్కర్ స్మృతివనం కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version