మా భార్యలు కాపురానికి వచ్చేలా చూడండి ప్లీజ్‌.. మామపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అల్లుళ్లు

-

సాధారణంగా ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాడు. మెట్టింట్లో భర్తతో సంతోషంగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం తన ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయినా సరే ఇంట్లోనే ఉంచుకున్నాడు. తమ భార్యలను కాపురానికి పంపించాలని అల్లుళ్లు ఎంతగా బతిమిలాడిన వినిపించుకోకుండానే వారిపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు. మామ వేధింపులతో కుంగిపోయిన ఇద్దరు అల్లుళ్లు.. తమ భార్యలను కాపురానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఏలూరుకు చెందిన బూరుగడ్డ శ్రీనివాస రామానుజ అయ్యంగార్‌కు ఇద్దరు కుమార్తెలు. 2015లో పెద్ద కుమార్తెను గుజరాత్‌లో ఉద్యోగం చేస్తున్న పవన్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ పెళ్లయిన రెండేళ్లకే కుమార్తెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక రెండో కుమార్తెకు విజయవాడకు చెందిన శేషసాయితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిపించాడు. అయితే చిన్న కుమార్తెను కూడా కాపురానికి పంపించకుండా ఇంటి దగ్గరే పెట్టుకున్నాడు. ఇదేంటి మా భార్యలను కాపురానికి పంపించడం లేదని అల్లుళ్లు ఎంతగా అడిగినా ఆ మామ వినిపించుకోవడం లేదు. తమ భార్యలను కాపురానికి పంపించాలని పదే పదే అడుగుతుండటంతో అల్లుళ్లనే ఆ మామ బెదిరిస్తున్నాడు. మళ్లీ తన ఇంటికి వస్తే తనను వేధిస్తున్నారని అక్రమ కేసులు పెడతానని వేధిస్తున్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ఇద్దరు తోడళ్లుల్లు ఏలూరు కలెక్టరేట్‌ మెట్లు ఎక్కారు. కలెక్టర్‌ ముందు తమ బాధను వెల్లగక్కారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version