ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. అయితే.. ఇందులో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. అంతేకాదు… పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా పదవులు కూడా దక్కాయి. చంద్రబాబు వద్ద సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు ఉన్నాయి.
అటు హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఫైనల్ అయ్యారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం.. కొల్లు రవీంద్రకు గనులశాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ ఇచ్చారు, పొంగూరు నారాయణ- పట్టణాభివృద్ధి, సత్యకుమార్- ఆరోగ్యశాఖ, నిమ్మల రామానాయుడు- జలవనరులు, నారా లోకేశ్ కు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అందించారు.