ఇవాళ, రేపు ఏపీలో తుపాను నష్టంపై కేంద్ర బృందం పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర సర్కార్ అప్డేట్ ఇచ్చింది. ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరుతో భేటీ కానుంది కేంద్ర బృందం. ఇక ఇవాళ మధ్యాహ్నాం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్న సెంట్రల్ టీం….రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు బృందాలుగా పర్యటించనుంది.
అలాగే… క్షేత్ర స్థాయి పరిశీలన.. అధికారుల నుంచి సమాచారం సేకరించనున్న సెంట్రల్ టీం…నాలుగు రోజుల్లో నివేదిక కూడా తయారు చేయనుంది. ఇది ఇలా ఉండగా, డిసెంబర్ 21, 22, 23, 24, 25 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మళ్లీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఈసారి తుఫాన్‌తో భారీ ముప్పు సంభవించే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రైతులు తమ పనులను డిసెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.