మేనమామ పై వై.ఎస్. షర్మిల ఆగ్రహం..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికార వైసీపీ పై విమర్శలు చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీ పై తనదైన శైలీలో విమర్శనాస్త్రాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన సోదరుడు జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై కూడా సెన్షేషన్ కామెంట్స్ చేశారు షర్మిల.

అందుకు అవినాష్ రెడ్డి కూడా షర్మిలకు కౌంటర్ వేశారు. తాజాగా తన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి పై కూడా వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అవినాష్ రెడ్డిని పక్కన కూర్చొబెట్టుకుని మాట్లాడటానికి సిగ్గు లేదా..? హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు ఇచ్చింది అని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించానని.. ఏపీలో కూడా పని ఉంది కాబట్టే.. ఇక్కడికి వచ్చానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. ప్రస్తుతం ఈమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version