నెల్లూరు ఎంపీ అభ్యర్థి గా విజయసాయిరెడ్డి

-

వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల అయింది. నిన్న వైసీపీ పార్టీ నేతలతో చర్చలు చేసి… వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల చేశారు సీఎం జగన్. వైసీపీ తొమ్మిదో జాబితా ప్రకారం…. వైసీపీ నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డి నియామకం అయ్యారు. అంటే నెల్లూరు ఎంపీ గా విజయసాయిరెడ్డి బరిలో ఉండనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు సాయి రెడ్డి. ఇక అటు కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా ఇంతియాజ్ నియామకం అయ్యారు. మంగళగిరి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా మురుగుడు లావణ్య ఫిక్స్ అయ్యారు.

Vijayasai Reddy as Nellore MP candidate

అయితే, మంగళగిరిపై వైసీపీ స్పెషల్ ఫోకస్ చేసింది. సీఎం క్యాంపు కార్యాలయానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. అటు సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు కు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, గంజి చిరంజీవి కూడా వచ్చారు. వారందరితో చర్చించి మంగళగిరి అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌గా మురుగుడు లావణ్య ను ఫిక్స్ చేశారు సీఎం జగన్. అంటే నారా లోకేష్ పై మురుగుడు లావణ్య పోటీ చేయబోతున్నారన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version