ఇంట్లో నాటు తుపాకులు తయారు చేస్తున్న గ్రామ వాలంటీర్ అరెస్ట్

-

చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామ వాలంటీర్ ఇంట్లో నాటు తుపాకులు, వాటి తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కార్వేటినగరం మండలం చింతోపు ఎస్టి కాలనీ వాలంటీర్ రవి ఇంట్లో తుపాకులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం అతని ఇంటిపై దాడులు చేశారు. ఈ సందర్భంగా రెండు నాటు తుపాకులు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రవి ని అరెస్టు చేసినట్లు కార్వేటినగరం ఎస్సై దస్తగిరి తెలిపారు.

విచారణలో వాలంటీర్ తుపాకులు తయారు చేస్తున్నట్లు తేలిందని, మరో ఇద్దరు మధ్యవర్తుల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని పేర్కొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో జంతువులను వేటాడడానికి కొద్ది రోజుల కిందట కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అది పాతది కావడం వల్ల సరిగ్గా పని చేయకపోవడంతో కొత్తది తయారు చేయాలని భావించారని, యూట్యూబ్ లో తుపాకీ తయారు చేసే విధానాన్ని పరిశీలించి.. అవసరమైన సామాగ్రిని కొన్నాడని.. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో ఎస్సై దస్తగిరి బుధవారం సిబ్బందితో కలిసి దాడి చేసి అరెస్టు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version