ఏపీలో 265 మండలాల ప్రజలకు హెచ్చరిక

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడ్తున్నాయి. ఈ తరుణంలోనే ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ రోజు ఏపీలో 31 మండలాల్లో తీవ్రవడగాలులు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు చేసింది. అలాగే 234 మండలాల్లో వడగాలులు ఉంటాయని వెల్లడించింది. ఈ తరుణంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక ఎండవేడిమికి, వడదెబ్బతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రోజున ఏడుగురు మృతి చెందారు. కొందరు అక్కడికక్కడే కుప్పకూలిపోతే.. మరికొందరు చికిత్స పొందుతూ మరణించారు. రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 8 మండలాలు, జగిత్యాలలో 6, కరీంనగర్‌లో 4, సిద్దిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్‌లో 2, జగిత్యాల జిల్లాలో 2 మండలాలతోపాటు ఖమ్మం నగరంలో వడగాలులు వీచినట్లు వాతావరణశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version