టిఫిన్ చేసి వచ్చే లోపు.. రూ.23 లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన తెలంగాణలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్లకు చెందిన వెంకటేశ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేసాడు. నార్కెట్‌పల్లి వద్ద బస్సు ఆగినప్పుడు రూ.23 లక్షల నగదుతో ఉన్న బ్యాగును బస్సులోనే పెట్టి, టిఫిన్ కోసం దిగాడు వెంకటేశ్.
ఈ క్రమంలో రూ.23 లక్షల నగదుతో ఉన్న బ్యాగును చోరీ చేసాడు దుండగుడు. ఇక వెంకటేశ్ ఫిర్యాదుతో సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుడిని గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
టిఫిన్ చేసి వచ్చే లోపు.. రూ.23 లక్షలు చోరీ
బాపట్లకు చెందిన వెంకటేశ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేట్ బస్సులో ప్రయాణం
నార్కెట్‌పల్లి వద్ద బస్సు ఆగినప్పుడు రూ.23 లక్షల నగదుతో ఉన్న బ్యాగును బస్సులోనే పెట్టి, టిఫిన్ కోసం దిగిన వెంకటేశ్
ఈ క్రమంలో రూ.23 లక్షల నగదుతో… pic.twitter.com/gIt5ODqZP6
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025