డిబేట్లకు – ఓట్లకు తేడా తెలుసుకోవాలంటున్నారు సర్!

-

కొందరు రాజకీయ నాయకులకు ప్రజలతో ప్రత్యక్షంగా పెద్దగా సంబంధాలు లేకపోయినా.. ఏనాడూ ప్రజా ప్రతినిధిగా గెలవకపోయినా.. టీవీ డిబేట్ల పుణ్యమాని తెగ ఫేమస్ అయిపోతుంటారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఇదే అసలు సిసలు రాజకీయం అని భ్రమపడితే మాత్రం మొదటికే మోసం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు విశ్లేషకులు!

ఇక విషయంలోకి వస్తే… ప్రజా ప్రతినిధిగా ఇప్పటిదాకా ఏనాడూ గెలవని బీజేపీనేత విష్ణువర్ధన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బలమైన హెచ్చరికలు చేసేస్తున్నారు. తానున్న రాయలసీమ ప్రాంతంలో బీజేపీకి అన్ని చోట్లా డిపాజిట్లు రాని పరిస్థితి పుష్కలంగా తెలిసిన విష్ణు… “మాతో పెట్టుకోవద్దు జగన్” అంటూ సవాల్ చేస్తున్నాడు.

మొన్న అంతర్వేది ఘటన, అనంతరం అమలాపురం సంఘటన, తిరుమలలో జగన్ డిక్లరేషన్ వ్యవహారాలపై స్వరం పెంచిన విష్ణు… ఈ మాత్రం కారణాలు చాలు ఏపీలో బీజేపీ జెండా పాతేసి ఎగరేసెయ్యడానికి అని ఫీలవుతున్నట్లున్నారనే కామెంట్లు ఈ సందర్భంగా పడుతున్నాయి. దీంతో… టీవీ డిబేట్లలో తొడగొట్టినంత ఈజీ కాదు.. పోలింగ్ బూత్ వద్దకు ఓట్లు తేవడం అని విష్ణువర్థన్ రెడ్డికి గుర్తుచేస్తున్నారు వైకాపా !!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version