ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయడంపై ఏపీ ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఉద్యోగుల, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎన్నికల కమిషన్ కు తాము సహకరించమని తేల్చి చేప్పిన ఉద్యోగులు, వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిందని ఆరోపిస్తున్న ఉద్యోగ సంఘాలు 64 సంఘాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయని ప్రకటన విడుదల చేశాయి. అంత అత్యవసరంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకు ? అని ప్రస్నిస్తున్నాయి. మరి ఐదేళ్లకాల పరిమితిలో ఎన్నికలు ఎందుకు నిర్వహించ లేదు ? మీ ప్రయోజనాల కోసం.. మా బతుకులను బలి పెట్ట వద్దని కోరుతున్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్ వస్తున్న సమయంలో ఎన్నికల ప్రక్రియ ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.