బ్రేకింగ్‌ : జగన్‌ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ

-

అమరావతి : జగనన్నవిద్యా దీవెన పధకం చెల్లింపులలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విద్యా దీవెన కార్యక్రమం కింద తల్లుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం… అయితే… తల్లులు ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడం పై హైకోర్టులో సవాల్ చేశారు. ఫీజులను కాలేజీ ప్రిన్సిపల్ ఎకౌంట్లో జమ చేయాలని కోర్టును ఆశ్రయించారు హైకోర్టు న్యాయవాది మతుకుమిల్లి శ్రీ విజయ్.

highcourt

కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా దీవెన డబ్బులు విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఎకౌంట్లో జమ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం తీర్పు కాపీలను వెబ్ సైట్ లో అప్ లోడు చేసిన హైకోర్టు..
నేరుగా కళాశాలల ఎకౌంట్ లో డబ్బులు జమ అవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది ఏపీ హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version