చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్‌ వ్యాప్తి

-

చైనాలో జంతువుల నుంచి మరో కొత్త వైరస్‌ మనుషులకు సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపావైరస్‌ ఇటీవల షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్స్‌ల్లో కొందరికి వ్యాపించినట్లు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న ఈ పేషంట్ల నుంచి సేకరించిన స్వాబ్‌లో ఈ వైరస్‌ ఆనవాళ్లను గుర్తించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇది సరికొత్త రకం హెనిపావైరస్‌ అని పరిశోధకులు తెలిపారు. దీనికి లాంగ్యా హెనిపావైరస్‌గా పేరుపెట్టారు. ఈ వైరస్‌ సోకిన పేషెంట్లలో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం, అనోరెక్సియా వంటి లక్షణాలు కనిపించాయి.

హెనిపా వైరస్‌ను బయోసేఫ్టీ లెవల్‌-4 వైరస్‌గా గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తుందని వెల్లడించింది. దీనిలో 40-75శాతం వరకు మరణాలు ఉండొచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాను ఆ పత్రిక ఉటంకించింది.

హెనిపావైరస్‌ వ్యాప్తి నివారణకు ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. కేవలం లక్షణాలను బట్టి బాధితులకు ఉపశమనం కల్పించే చికిత్సలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ వైరస్‌ సోకిన బాధితులను పరిశోధించగా.. తీవ్రమైన లక్షణాలు లేవని డ్యూక్‌ ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌ వాంగ్‌ లింఫా పేర్కొన్నారు.

ఈ వైరస్‌ సోకిన 35 మందిలో 26 మందికి జ్వరం, దగ్గు, అనోరెక్సియా, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ప్రకృతిలో ఉన్న వైరస్‌లు మనుషులకు సోకితే ఎటువంటి పరిణామాలు ఉంటాయో తెలిపేందుకు ఇదో హెచ్చరిక వంటిదని వాంగ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version