ఓటీటీలో ‘అంటే సుందరానికీ’ స్ట్రీమింగ్!

-

న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలితాలతో సంబంధం లేకుండా భిన్నమైన సినిమా స్టోరీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటారు.ఇటీవల ఆయన నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ హిట్‌టాక్ నమోదు చేసుకుంది. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో జూన్ 12వ తేదీన విడుదలైంది. అయితే నాని గత సినిమాలతో పోల్చితే ఈ సినిమా కలెక్షన్లల్లో జోరు చూపించలేకపోయింది.

అంటే సుందరానికీ

అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో ‘అంటే సుందరానికీ’ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో ఈ సంస్థ ఓటీటీలో సినిమాను విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. జులై 10న తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో హీరోయిన్‌గా నజ్రియా నటించారు. కాగా, ప్రస్తుతం నాని ‘దసరా’ సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version