ఏపీ కేబినేట్ భేటీ, రాజధాని గ్రామాల్లో హైఅలెర్ట్…!

-

కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ నేపధ్యంలో రాజధాని గ్రామాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి,దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. నేడు మందడం రైతులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ రోజు సచివాలయంలో క్యాబినెట్ ఉన్న నేపథ్యంలో మధ్యాన్నం వరకు రైతులు శిబిరం వద్దకు రావద్దని ఆంక్షలు విధించారు.

తాడేపల్లి నివాసం నుండి మందడం శిబిరం ముందు నుండి సచివాలయం వద్దకు వెళ్తున్నారు. కాబినెట్ ముగిసి సీఎం తాడేపల్లి నివాసానికి వెళ్ళాకే శిబిరం వద్దకు అనుమతి ఇస్తాం అని రైతులకు పోలీసులు స్పష్టం చేసారు. రాజధాని బిల్లులు అంశంపై నేడు సుప్రీంకోర్టు లో విచారణ ఉన్న నేపథ్యంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి రాజధాని గ్రామాలు. ప్రభుత్వం అమరావతే రాజధాని అనే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news