ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది.
అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, పునర్నిర్మాణ పనులకు ప్రధాని పర్యటనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. ఇక ఈ క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో మంత్రి లోకేష్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం కూడా ఉంటుంది. ఉ.9 గంటలకు సీఎం క్యాప్ ఆఫీసులో లోకేష్ బ్రేక్ ఫాస్ట్ భేటీ ఉంటుంది.