మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్ సమావేశం.. కీలక బిల్లులకు ఆమోదం !

Join Our Community
follow manalokam on social media

మరి కాసేపట్లో ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కాబోతోంది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ కాబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టే పలు బిల్లులను కూడా మంత్రి వర్గం ఆమోదించనుంది.

అంతేకాక విభజన హామీలు, ఉద్యోగుల పంపకం అలాగే మరిన్ని అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తిరుపతిలో జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం పైన కూడా చర్చలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం దాని మీద ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే త్వరలో మునిసిపల్ ఎన్నికలు కూడా ఉండడంతో దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...