ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. హైదరాబాద్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి ఏపీ సిఐడి అధికారులు చేరుకున్నారు. ఈ సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అమరావతిలో భూముల కొనుగోలు అమ్మకాల పై చంద్రబాబు పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఆంధ్రప్రదేశ్ cid ఇప్పుడు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.
అయితే సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకు ఈ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ముందు నుంచి అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబు అండ్ కో అవినీతికి పాల్పడిందని అధికార వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. చంద్రబాబు కూడా దానికి తగ్గట్టే ఏం పీక్కుంటావో పీక్కో అంటూ పలు సభలలో, ప్రెస్ మీట్ లలో అధికారపక్షానికి సవాల్ విసిరారు. ఇక హైదరాబాద్ కు మొత్తం రెండు బృందాలుగా ఏపీ సిఐడి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది.