ఏపీ ప్రభుత్వం ప్రజలకి మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ప్రైవేటు ల్యాబరేటరీల్లో కోవిడ్ 19 పరీక్షలకు వసూలు చేసే ధరల్ని సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఏబీఎల్, ఐసీఎంఆర్ లు అనుమతించిన ప్రైవేట్ ల్యాబరేటరీల్లో పరీక్షలకు వసూలు చేసే ధరలను సవరిస్తూ నిన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్ఎన్ఏ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లు మార్కెట్ లో పూర్తిగా అందుబాటులోకి రావటంతో పరీక్షల కోసం వసూలు చేస్తున్న ధరలను ప్రభుత్వం తగ్గించింది.
అంతే కాక ప్రభుత్వం పంపించే నమూనాలకు రూ. 800 మాత్రమే వసూలు చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అలానే వ్యక్తిగతంగా తీసుకువచ్చే నమూనాలకు రూ. 1000 వరకూ వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాగే, అన్ని టెస్ట్ ధరలను ల్యాబ్‌లు బయట ప్రదర్శించాలని స్పష్టం చేసింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను ఆరోగ్యశ్రీ సీఈవోకు అప్పగించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.