ఏపీలో కొత్తగా 142 కరోనా కేసులు, 2 మరణాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు… అసలు స్థిరంగా ఉండటం లేదు. నిన్న పెరిగిన కరోనా మహమ్మారి కేసులు… ఇవాళ ఒక్కసారిగా పడిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 142 కరోనా మహమ్మారి కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి.

ap carona

అలాగే కరోనా మహమ్మారి కారణంగా చిత్తూరు మరియు కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇక గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 188 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 32, 793 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ.

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షలు సంఖ్య 3,07, 15,406 కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 144 42 మంది మరణించారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1989 కరోనా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా మహమ్మారి కేసుల సంఖ్య 2074552 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version