ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రం లో పోలీసులందరికీ వీక్లీ ఆఫ్ లు ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా దీనిని తక్షణమే అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఎస్పీ లకు పోలీస్ కమిషనర్ల కు ఆదేశాలు ను కూడా జారీ చేశారు. దీంతో రాష్ట్రం లోని పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు సెలవు లు అంటు ఉండేవి కాదు. తాజా గా డీజీపీ గౌతమ్ సవాంగ్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తం గా పోలీసు లకు వారానికి ఒక రోజు అధికారికంగా సెలవు ఉంటుంది. అయితే ఇటీవల అక్టోబర్ లో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ సభలో పోలీసుల అందరికీ వారం లో ఒక రోజు సెలువు ఉండేలా నిర్ణయం తీసుకుంటామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. దానిని అమలు చేస్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయం తీసుకున్నారు.