ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంసెట్ షెడ్యూల్ ను ఇవాళ ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు EAPCET(గతంలో ఎంసెట్) పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 24 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. జూలై 25 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష ఫీజులను కూడా ఆయన వెల్లడించారు. రూ. 500 ఫైన్ తో జూలై 26 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు తీసుకుంటామని.. అలాగే రూ. 1000 లేట్ ఫీజుతో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 వరకు మరియు రూ. 5000 లేట్ ఫీజుతో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అని ఆయన ప్రకటించారు.
అంతేకాదు రూ. 10,000 లేట్ ఫీజుతో ఆగస్టు 16 నుంచి ఆగష్టు 18 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అలాగే ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్ సెట్ లాంటి ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కాగా ఏపీలో ఇంకా టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఇంకా నిర్వహించలేదు సర్కార్. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.