చూసుకోండి: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కరోనా కొత్త లక్షణాలు ఇవే!

-

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం, దేశ వ్యాప్తంగా ప్రతీ రాష్ట్రం ఆలోచిస్తున్న ప్రధాన అంశం.. కరోనా! వచ్చిన మొదట్లో అంతా చాలా భయపడ్డారు.. ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి.. కరోనా కూడా కాస్త కంట్రోల్ లోనే ఉంది. జనాలకు అలవాటైపోయిందో లేక ప్రభుత్వాల అలసత్వమో, అదీగాక ఇద్దరి నిర్లక్ష్యమో తెలియదు కానీ… తాజాగా కరోనా రోజు రోజుకీ తీవ్రమవుతూ, తన పరిధిని, తన లక్షణాలను పెంచుకుంటూ పోతుంది. ఈ క్రమంలో… కరోనా కొత్త లక్షణాలను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

అధికంగా టెస్టులు చేస్తూ రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఫిలట్ర్ చేసే ప్రక్రియలో బిజీగా ఉన్న ఏపీ సర్కార్.. ఇంతకాలం కరోనా లక్షణాలుగా ఉన్న… జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు మాత్రమే కరోనా లక్షణాలు కాదంటూ.. తాజాగా మరికొన్ని కరోనా లక్షణాలను ప్రకటించింది. ఈ మేరకు ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్.. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది.

కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అనే సంస్థ తన అధికారిక జాబితాలో చేర్చింది. దీంతో.. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.

అవి… జ్వరం.. వణుకు.. దగ్గు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. అలసట.. ఒళ్లు నొప్పులు.. తలనొప్పి.. రుచి చూడలేకపోవడం.. వాసన పసిగట్టలేకపోవడం.. గొంతునొప్పి.. ముక్కు కారడం.. వికారం లేదా వాంతులు.. డయేరియా గా గుర్తించారు! ఈ లక్షణాలను ఎవరికి ఉన్నా… వారు వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలని.. లేదా 104 నంబర్‌కు కాల్ చేయాలని సూచిస్తుంది ఏపీ ప్రభుత్వం!

Read more RELATED
Recommended to you

Exit mobile version