ఏపీ దేవాదాయ శాఖ ప్రక్షాళన దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో ఉన్న అవినీతి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దేవాదాయ శాఖ కమిషనర్ ను త్వరలో బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దుర్గగుడి లోని ఉద్యోగులు సిబ్బంది చేతివాటం పై కొరడా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ పరిపాలన విభాగంలో అవినీతి పుట్టలను పగలగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
అందుకోసం ఏపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోటు చేసుకున్న అవినీతి గురించి తెలిసిందే. ఏసీబీ సోదాలు అనంతరం దుర్గ గుడిలో ఉద్యోగుల అవినీతి లీలలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల అప్రమత్తం అయ్యారు.ఈ క్రమంలోనే మరిన్ని ప్రముఖ దేవాలయాల్లోని ఉద్యోగులు, సిబ్బంది అవినీతి కార్యకలాపాలు వెలికి తీసే చర్యలకు పూనుకుంటున్నారు.