బిగ్ బ్రేకింగ్ : ఎంపీటీసీ, జేడీపీటీసీ ఎన్నికల మీద హైకోర్టు స్టే

-

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నాలుగు వారాల కోడ్ అమలు చేయలేదని హైకోర్టు పేర్కొంది. 7258 ఎంపీటీసీ, 516 జెడ్పీటీసీలకు ఎల్లుండి ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయితే ఈ ఎన్నికల మీద స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది. అయితే కొత్త నోటిఫికేషన్ అవసరం లేదన్న హైకోర్టు ఏమి చేయాలో తదుపరి విచారణ రోజున వెల్లడిస్తామని పేర్కొంది.

కోడ్ విధించలేదని పేర్కొంటూ తెలుగుదేశంపార్టీ వేసిన పిటిషన్ గురించి ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరో పక్క ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని సిద్ధం చేసుకుంది. ఎల్లుండి ఎన్నికలు జరగాల్సి ఉండగా ఏపీ హైకోర్టు స్టే విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మళ్లీ 15 అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్ని బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అలా చేయడం పలు చర్చలకు దారి తీసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version