ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కి, బొత్స సత్యనారాయణకు హైకోర్టు షాకిచ్చింది, ఈ ఇద్దరికీ కొద్ది సేపటి క్రితం నోటీసులు జారీ చేసింది. నిజానికి కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను గవర్నర్ కు రాసిన లేఖలో అంశాలు అన్నీ సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయని చెబుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ లో ప్రతివాదులుగా ఏపీ సిఎస్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, సత్య నారాయణ పేర్లు కూడా చేర్చారు. తాను సెలవు పెడుతున్న విషయలీ కూడా బయటకు వస్తున్నాయని పిటిషన్‌లో ఆయన ప్రస్తావించారు..
తాను గవర్నర్‌కు రాసిన లేఖల్ని సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని నిమ్మగడ్డ పిటిషన్‌లో ప్రస్తావించారు. అదేలా సాధ్యమో విచారణ జరపి తెలుసుకోవాలని కోరారు.. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు మంత్రులకు నోటీసులు జారీ చేసింది.ఈ అంశం మీద స్పందించిన బొత్స నిమ్మగడ్డకు సంబంధించిన సీక్రెట్స్ ఏమి బయటకు వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదని, ఆయనైనా, నేనైనా హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరగాలని అన్నారు. ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి తాను రాను అంటూ నిమ్మగడ్డ చెప్పిన విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ చూసుకుంటుందని అన్నారు.