జగన్ సర్కార్ కు మరో బిగ్ షాక్ తగిలింది. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ లేఖ రాసింది. 14, 15వ ఆర్ధిక సంఘం నిధులని సర్పంచుల ఖాతాల్లో నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టిందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ఏపీ ప్రభుత్వం సర్పంచుల ఖాతాల్లో నుంచి రూ. 7660 కోట్ల మేర పంచాయతీ నిధులను దొంగిలించిందని.. ఏపీలోని 12918 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 14,15 వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్.
సర్పంచుల సీఎఫ్ఎంఎస్ అకౌంట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7660 కోట్ల దొంగిలించింది… చెక్కులపై సంతకాలు లేకుండా, సర్పంచులకు చెప్పకుండా, గ్రామ సభల తీర్మానాలు లేకుండా నిధువ మళ్లింపు దారుణమని పేర్కొంది ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్. గ్రామ పంచాయతీల అకౌంట్లు నిల్ బ్యాలెన్సులు చూపించడంతో సర్పంచులు షాక్ కు గురయ్యారు… గ్రామాలలో రోడ్లు, త్రాగునీరు, డ్రైన్లు, శానిటేషన్ వంటి పనులు ఆగిపోయాయి… ఏపీలో ఆర్దిక సంఘం నిధుల మళ్లింపుపై కేంద్రం విచారణ జరపాలని డిమాండ్ చేసింది.